భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదు: సర్పంచి కుమార్

ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు నాయక్ ఆధ్వర్యంలో గెయిల్ ఇండియా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ ఆరోపించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాలకు ప్రథమ పౌరుడు సర్పంచి అని పేర్కొన్నారు. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఇనుగుర్తి గ్రామానికి ప్రథమ పౌరుడైన తనను కార్యక్రమం వేదికపైకి ఆహ్వానించే విషయంలో ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదన్నారు.

గ్రామ సర్పంచిగా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరించడం తనతో పాటు ఇనుగుర్తి గ్రామానికి కూడా అవమానకరమని సర్పంచి కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను పాటిస్తూ ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.