భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు నాయక్ ఆధ్వర్యంలో గెయిల్ ఇండియా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ ఆరోపించారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాలకు ప్రథమ పౌరుడు సర్పంచి అని పేర్కొన్నారు. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఇనుగుర్తి గ్రామానికి ప్రథమ పౌరుడైన తనను కార్యక్రమం వేదికపైకి ఆహ్వానించే విషయంలో ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదన్నారు.
…






