భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం ఎస్సీ కాలనీలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణపతి వద్ద శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మద్దెల సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చెడుపాక యాకూబ్–కవిత దంపతులు, సీనియర్ నాయకులు బొబ్బల ముత్తయ్య యాదవ్, భూక్య బాలాజీ నాయక్, చెడుపాక శ్రీను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సేవాభావం చాటుతున్నారని పేర్కొన్నారు.
చెడుపాక కార్తీక్, చెడుపాక మధు, చెడుపాక కుమార్, చెడుపాక కృష్ణమోహన్, చెడుపాక బాబు, చెడుపాక బబ్బులు ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. భక్తులు ప్రసాదాన్ని స్వీకరించి నిర్వాహకులను అభినందించారు.
కార్యక్రమంలో మహాన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన భక్తులతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి వాతావరణంలో కొనసాగింది.