భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం ఎస్సీ కాలనీలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణపతి వద్ద శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులు మద్దెల సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చెడుపాక యాకూబ్–కవిత దంపతులు, సీనియర్ నాయకులు బొబ్బల ముత్తయ్య యాదవ్, భూక్య బాలాజీ నాయక్,…