భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జర్నలిస్టులకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే పాస్‌లను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ఇనుగుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జర్నలిస్టులకు రైల్వే పాస్‌లు అందుబాటులో ఉండేవని తెలిపారు. అయితే 2019లో కరోనా నేపథ్యంలో జర్నలిస్టులకు సంబంధించిన రైల్వే పాస్‌లను తొలగించారని పేర్కొన్నారు. జర్నలిస్టుల వృత్తిపరమైన ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే పాస్‌లను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టులు అందజేసిన వినతిపత్రంపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇనుగుర్తి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ దార్ల భాస్కర్, జర్నలిస్టులు వాసు దేవ గౌడ్, బొలగాని యాకయ్య గౌడ్, పెదగోని రాజు గౌడ్, గాడుదుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.