భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

కందుల సాగుతో లాభాల బాట.. మదాపూర్‌లో క్షేత్ర సందర్శన

ఆరుతడి పంట - కందుల సాగు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై కీలక సూచనలు ఏడీఏ సంధ్యారాణి.

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం మదాపూర్ గ్రామంలో శ్రీ కిష్టయ్యకు చెందిన 5 ఎకరాల్లో సాగు చేస్తున్న కంది పంట క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు సందర్శించారు. ఈ సందర్భంగా కంది పంట సాగు విధానం, పంట స్థితి, నిర్వహణ చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యా రాణి మాట్లాడుతూ.. వరి పంటపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించి, నేల ఆరోగ్యం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, రైతులకు లభించే ఆదాయ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కందులు వంటి పప్పుధాన్య పంటలు పంటల మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఆరుతడి పంట - కందుల సాగు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై కీలక సూచనలు ఏడీఏ సంధ్యారాణి.

రైతులు తమ ప్రాంతంలోని నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సంధ్యా రాణి సూచించారు. కిష్టయ్య 5 ఎకరాల్లో చేపట్టిన కందుల సాగును పరిశీలించిన రైతులు పంట స్థితి, సాగు విధానం, పంట నిర్వహణ చర్యలను తెలుసుకున్నారు.

ఇలాంటి క్షేత్ర సందర్శనలు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆచరణాత్మక అవగాహన కల్పించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. క్షేత్ర సందర్శనలో మండల వ్యవసాయ అధికారిణి దీపిక, ఏఈఓలు మోహన్, లావణ్య, హరీష్ పాల్గొన్నారు. మదాపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు కూడా క్షేత్రాన్ని సందర్శించి కందుల సాగు విధానాలు, పంట నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పొందారు.