భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

హనుమాన్ టెంపుల్ గణపతికి ప్రత్యేక పూజలు

హనుమాన్ టెంపుల్ గణపతి వద్ద ప్రత్యేక పూజలు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద నిత్య ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద నివేదన చేశారు.

అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకులు, ప్రముఖ వేద పండితులు శ్రీశ్రీశ్రీ తిరుణహరి కృష్ణమాచార్యులు నిత్య పూజాధిక కార్యక్రమాల్లో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.

మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి సన్నిధిలో పూజల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉడుత యాకాంతం యాదవ్, స్వరూప దంపతులతో పాటు జర్నలిస్టులు పంజాల వాసుదేవ గౌడ్, బొలగాని యాకయ్య గౌడ్, మాజీ వార్డు సభ్యులు బైరు హరి ప్రసాద్ గౌడ్, ఆర్టీసీ కండక్టర్ పోలోజు సుధాకరాచారి తదితరులు విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు.