భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మునిగలవీడిలో పోషణ మాసోత్సవం

మునిగలవీడిలో పోషణ మాసోత్సవం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఐసీడీఎస్ అంగన్‌వాడీ ఆధ్వర్యంలో శనివారం పోషణ మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్‌లో భాగంగా శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు హాజరై మాట్లాడుతూ.. ఐసీడీఎస్ అంగన్‌వాడీ సేవలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించాలని తెలిపారు.

సూపర్‌వైజర్ సరిత మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. రక్తహీనత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

పాలు, గుడ్లు, బీట్‌రూట్, బెల్లం, నువ్వుల ఉండలు, పల్లి పట్టీలు, మునగాకు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను వయసుతో సంబంధం లేకుండా తీసుకోవాలని సూచించారు. పోషకాహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచి మల్లయ్య, ఉపాధ్యాయులు గీత, సుధాకర్, యుగేందర్, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.