భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఐసీడీఎస్ అంగన్‌వాడీ ఆధ్వర్యంలో శనివారం పోషణ మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్‌లో భాగంగా శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు హాజరై మాట్లాడుతూ.. ఐసీడీఎస్ అంగన్‌వాడీ సేవలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించాలని తెలిపారు.

సూపర్‌వైజర్ సరిత మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని…