భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తేజావత్ బాలు అకాల మృతి బాధాకరమని గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శనివారం బాలు మృతదేహాన్ని సర్పంచ్ సందర్శించి పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కళావతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి బాలు ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకాల మరణంతో మన మధ్య లేకపోవడం పార్టీకి తీరని లోటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని తెలిపారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు 50 కిలోల బియ్యాన్ని సర్పంచ్ అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బద్రి నాయక్, వార్డు సభ్యులు అశోక్, వీరన్న, సావిత్ర, హారిక, నాయకులు లాలు నాయక్, వెంకన్న నాయక్, కీమా, ఎల్. వెంకన్న, ముత్యాల మల్లయ్య, లచ్చయ్య, రమేష్, వెంకట్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.