భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

చిన్ననాగారంలో ఘనంగా మహాన్న ప్రసాద వితరణ

చిన్ననాగారంలో ఘనంగా మహాన్న ప్రసాద వితరణ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి వద్ద శనివారం మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.

స్వర్గీయ ఉడుత గోపాలు–సాలమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉడుత కొమరుమల్లు యాదవ్–పద్మ దంపతులు, వారి కుమారుడు, కోడలు సంతోష్–మంజుల కలిసి మహాన్న ప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మహాన్న ప్రసాద తయారీ, వితరణ కార్యక్రమంలో బైరు సుధాకర్–రాజమణి, మురళి–కవిత, చిర్రబోయిన శిరీష–కుమార్, మునిగంటి చందన–నరేష్, బొబ్బల అరుణ–ఎలేందర్, బైరు నాగమణి–శ్రీనివాస్, కొయ్యడి శోభ–యాకాంతం గౌడ్ దంపతులతో పాటు పోలోజు కలమ్మ, బండారి యాకలక్ష్మి, బింగి విజయ, బైరు హరిప్రసాద్ గౌడ్, బైరు శ్రీరాములు గౌడ్ సేవలందించారు.

వీరితో పాటు వార్డు మెంబర్ వై. శ్రీనివాస్ యాదవ్, ఆర్టీసీ కండక్టర్ పోలోజు సుధాకరాచారి, బొబ్బల ముత్తయ్య, పంజాల నాగరాజు గౌడ్, దేవరాజు గౌడ్–కవిత దంపతులు, బింగి శరత్ గౌడ్, నవనందుల సాంబయ్య తదితరులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.