భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి వద్ద శనివారం మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.
స్వర్గీయ ఉడుత గోపాలు–సాలమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉడుత కొమరుమల్లు యాదవ్–పద్మ దంపతులు, వారి కుమారుడు, కోడలు సంతోష్–మంజుల కలిసి మహాన్న ప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
మహాన్న ప్రసాద…






