భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

1వ వార్డులో ఘనంగా అన్నప్రసాద వితరణ

ఫస్ట్ వార్డ్ లో ఘనంగా అన్న ప్రసాద వితరణ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని 1వ వార్డులో ఏర్పాటు చేసిన గణపతి ఆలయం వద్ద ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ సర్పంచి బైరు చిన్నయ, బాలయ్య–వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అంతకుముందు గణపతి స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు గ్రామస్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య, వార్డు సభ్యులు గుండాల మంగమ్మ ధర్మయ్య, నిడిగంటి చంద్రమౌళి, నాయకులు కొయ్యడి యాకాంతం గౌడ్, బైరు శ్రీనివాస్, మరద హరికృష్ణ, దుర్గా స్వామి, బత్తిని రాములు, బైరు హరి ప్రసాద్ గౌడ్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.