భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని 1వ వార్డులో ఏర్పాటు చేసిన గణపతి ఆలయం వద్ద ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ సర్పంచి బైరు చిన్నయ, బాలయ్య–వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు గ్రామస్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని…





