భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

కరాటేలో అదరగొట్టిన రామాయంపేట విద్యార్థులు

కరాటేలో అదరగొట్టిన రామాయంపేట విద్యార్థులు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కరాటేలో రామాయంపేట విద్యార్థులు సత్తా చాటి పతకాల పంట పండించారు. హైదరాబాద్‌లో వరల్డ్ నాకామయ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో రామాయంపేటకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పట్టణానికి చెందిన 17 మంది విద్యార్థులు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనగా, తొమ్మిది మంది గోల్డ్ మెడల్స్, నలుగురు సిల్వర్ మెడల్స్, మరో నలుగురు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. దీంతో పోటీల్లో పాల్గొన్న మొత్తం 17 మంది విద్యార్థులు పతకాలు సాధించడం విశేషంగా నిలిచింది.

విద్యార్థులు సాధించిన విజయంపై రామాయంపేట కరాటే వ్యవస్థాపకులు రొయ్యల హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. విజేతలను అభినందిస్తూ క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రామాయంపేట విద్యార్థులు తమ ప్రతిభను చాటడం గర్వకారణమని అన్నారు.

బ్లాక్‌బెల్ట్ మాస్టర్ సంపత్‌కుమార్ శిక్షణలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరై పతకాలు సాధించారు. విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.