భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం

పద్మశాలి ఆధ్వర్యంలో వినాయక నిమర్జన కార్యక్రమం   మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శివాలయం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ప్రాంగణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు దండియా, కోలాటాలతో సందడి చేస్తూ గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.

పద్మశాలి ఆధ్వర్యంలో వినాయక నిమర్జన కార్యక్రమం   మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శివాలయం

వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో సంగమేశ్వర్ రూ.45 వేలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు ధనవృద్ధి కలగాలని కోరుకున్నారు.

శివాలయ పూజారి వీరప్ప స్వామి మాట్లాడుతూ భక్తులందరిపై గణనాథుడి కృప ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.