భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ప్రాంగణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు దండియా, కోలాటాలతో సందడి చేస్తూ గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో సంగమేశ్వర్ రూ.45 వేలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు…





