భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ప్రజల సుఖసంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే సునీత

వినాయకునికి  ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి ,,

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో సంతోషం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

వినాయకునికి  ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి ,,

అనంతరం రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి ఆనంద్ కుమార్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నహిముద్దీన్, కౌన్సిలర్ బుల్లెట్ రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యం గౌడ్, ప్రసాద్, జ్ఞానేశ్వర్, మహిపాల్ రెడ్డి, షేక్ హుస్సేన్‌తో పాటు భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు.