భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో సంతోషం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

అనంతరం రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి ఆనంద్ కుమార్ ఏర్పాటు…