భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

కోమటిపల్లిలో ఫిజియోథెరపీ అవగాహన శిబిరం

కొమటిపల్లిలో ఫిజియోథెరపీ అవగాహన శిబిరం

భారత్ సమాచార్, మహబూబాదు జిల్లా: ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామంలో జూబ్లీహిల్స్, హైదరాబాద్‌కు చెందిన శ్రీ రాఘవాస్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ, సమగ్ర ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లేటి కిరణ్, రాష్ట్ర నాయకులు పడకంటి అనురాగ్ సహకారం అందించారు.

శిబిరానికి గ్రామస్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరై ఫిజియోథెరపీ నిపుణుల నుంచి తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పలు సూచనలు, సలహాలు పొందారు. పలువురు గ్రామస్థులు తమకు ఉన్న నొప్పులు, శారీరక సమస్యలను నిపుణుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన మార్గదర్శకాలను తెలుసుకున్నారు.

శిబిరంలో ప్రత్యేకంగా సమగ్ర ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, రోజువారీ అలవాట్లలో అవసరమైన మార్పులు, శారీరక వ్యాయామం ప్రాధాన్యతపై నిపుణులు ప్రాథమిక సూచనలు అందించారు. ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యేలోపే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

కొమటిపల్లిలో ఫిజియోథెరపీ అవగాహన శిబిరం

శిబిరానికి హాజరైన పలువురు గ్రామస్థులు తమ నొప్పులు, శారీరక సమస్యలపై విలువైన సూచనలు పొందినందుకు శ్రీ రాఘవాస్ ఫిజియోథెరపీ క్లినిక్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

శ్రీ రాఘవాస్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ, అవసరమైన వర్గాల ప్రజలకు ఫిజియోథెరపీ, నొప్పి నిర్వహణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, నివారణాత్మక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ భిక్షపతి, ఆలయ చైర్మన్ షేర్ శ్రీనివాస్, పోడకంటి వెంకటేశ్వర్లు, స్వామి, సతీష్, రావుల మల్లేశం, కూరెల్లి సతీష్, పాత తండా సర్పంచ్ నరేష్, నీలం యాకయ్య తదితరులు పాల్గొన్నారు.