భారత్ సమాచార్, మహబూబాదు జిల్లా: ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామంలో జూబ్లీహిల్స్, హైదరాబాద్‌కు చెందిన శ్రీ రాఘవాస్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ, సమగ్ర ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లేటి కిరణ్, రాష్ట్ర నాయకులు పడకంటి అనురాగ్ సహకారం అందించారు.

శిబిరానికి గ్రామస్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరై ఫిజియోథెరపీ నిపుణుల నుంచి తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పలు సూచనలు,…