భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

గణపతుల వద్ద కొనసాగుతున్న అన్నప్రసాద వితరణలు

గణపతుల వద్ద కొనసాగుతున్న అన్నప్రసాద వితరణలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపాల వద్ద భక్తుల అన్నప్రసాద వితరణ పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలోని పలు గణపతి మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.

హనుమాన్ టెంపుల్ గణపతి వద్ద..

హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఆలయంలో రిటైర్డ్ ఏఎస్ఐ పోలోజు మదనాచారి–జయమ్మ దంపతులు, వారి కుమారుడు, కోడలు కానిస్టేబుల్ రవికుమార్–జ్యోతి దంపతులు తమ కుటుంబ సభ్యుల తరఫున, మదనాచారి తల్లిదండ్రులైన స్వర్గీయ రామ బ్రహ్మచారి–భద్రమ్మల జ్ఞాపకార్థం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులు స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

స్టూడెంట్ యూత్ వినాయకుని వద్ద..

స్టూడెంట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని వద్ద వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు–సావిత్రి దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

కొత్తవాడ బొజ్జ గణపయ్య వద్ద..

గ్రామంలోని కొత్తవాడలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య మండపం వద్ద స్థానిక వెజిటబుల్ వ్యాపారులు గోపు చంద్రారెడ్డి–కవిత దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించగా, భక్తులు స్వీకరించారు.

గణపతుల వద్ద కొనసాగుతున్న అన్నప్రసాద వితరణలు

ముత్యాలమ్మ టెంపుల్ గణపతి వద్ద..

శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం కళావేదిక వద్ద ముత్యాలమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపం వద్ద మద్యబోయిన శ్రీనివాస్–సావిత్రి దంపతులు, వారి కుమారులు ప్రసాద్–లక్ష్మి దంపతులు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

శివశక్తి యూత్ గణపతి వద్ద..

విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శివశక్తి గణపతి ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇనుగుర్తి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి భగవత్ కృపకు పాత్రులయ్యారు.

బొడ్రాయి గణపతి వద్ద..

గ్రామంలోని బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ మహాగణపతి మండపంలో చిర్రబోయిన బ్రదర్స్ కొమురయ్య యాదవ్, సతీష్ యాదవ్, చెడుపాక శ్రీను ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భగవద్భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఆయా అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచి, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు, ఆలయ కమిటీల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.