భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

బస్టాండ్‌లో గుర్తుతెలియని బాలుడు.. పోలీసుల కీలక విజ్ఞప్తి

బస్టాండ్‌లో గుర్తుతెలియని బాలుడు.. పోలీసుల కీలక విజ్ఞప్తి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సుమారు 11 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని బాలుడు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు బ్లూ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. బాలుడికి మాటలు రావడం లేదని, తన వివరాలను వెల్లడించే పరిస్థితిలో లేడని తెలిపారు.

బస్టాండ్‌లో గుర్తుతెలియని బాలుడు.. పోలీసుల కీలక విజ్ఞప్తి

బాలుడిని ఎవరైనా గుర్తుపడినట్లయితే లేదా అతడి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

బాలుడి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు 8712657940 నంబర్‌కు సంప్రదించాలని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. బాలుడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.