భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సుమారు 11 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని బాలుడు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు బ్లూ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. బాలుడికి మాటలు రావడం లేదని, తన వివరాలను వెల్లడించే పరిస్థితిలో లేడని తెలిపారు.

బాలుడిని ఎవరైనా గుర్తుపడినట్లయితే లేదా అతడి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

బాలుడి ఆచూకీ…