భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

వెంకేపల్లిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆహార భద్రతలో సరికొత్త అధ్యాయం: మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఇమ్మడి జయకుమార్ పాల్గొని మాట్లాడారు.

పాత దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేరవేసేందుకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర ఏళ్లలోనే 62 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.

3.42 కోట్ల కుటుంబాలకు కుటుంబంలోని ప్రతి సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆహార భద్రతలో నూతన అధ్యాయానికి తెరలేపుతూ, పూర్తి పారదర్శకంగా ఆహార భద్రతను అందించేలా స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పాల్వాయి నాగయ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోనుకునూరి సైదులు, గ్రామ శాఖ అధ్యక్షుడు కుంట్ల చంద్రారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్, యూత్ ఉపాధ్యక్షుడు పాల్వాయి కార్తీక్, కొరివి గంగయ్య, కార్యదర్శి తాళ్లపల్లి వెంకన్న, జీపీఓ సురేఖ, రేషన్ డీలర్ కృష్ణమూర్తి, స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.