భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఇమ్మడి జయకుమార్ పాల్గొని మాట్లాడారు.

పాత దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేరవేసేందుకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర…