భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

కరివిరాలలో ఘనంగా ఉండ్రాళ్ల మహోత్సవం

తుంగతుర్తి: కరివిరాలలో జై భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జై బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామివారికి ఉండ్రాళ్ల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తుంగతుర్తి: కరివిరాలలో జై భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

ఈ సందర్భంగా అర్చకులు వాస్తు మాధవ్ మాట్లాడుతూ.. గణపతికి శిరస్సు పెట్టిన అనంతరం పార్వతి దేవి తొలిసారిగా ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారని తెలిపారు. అప్పటి నుంచి గణపతికి ఉండ్రాళ్లను సమర్పించే సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. గణపతికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించడం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు.