భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును కలిసిన గౌడ సంఘం నాయకులు

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును కలిసిన గౌడ సంఘం నాయకులు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అమెరికా విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును జిల్లా గౌడ సంఘం నాయకులు కలిశారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్సీ రవీందర్ రావుకు స్వాగతం పలికి, ఆయన విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐక్య గౌడ సంఘాల అధ్యక్షుడు జెర్రీ పోతుల వెంకన్న గౌడ్, ముత్యం వెంకన్న గౌడ్, పెద్ది వెంకన్న గౌడ్, కుంభం యాదగిరి గౌడ్, గండి వీరేందర్ గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్, గూదే వీరన్న గౌడ్, గాడిపెల్లి శ్రీహరి గౌడ్, ఉదయ్ దీర్ గౌడ్, గడ్డం సమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.