భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ప్రజావాణిలో వెల్లువెత్తిన సమస్యలు

నెల్లికుదురు ప్రజావాణి కి 11 దరఖాస్తులు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఐదు దరఖాస్తులు, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. హౌసింగ్ సమస్యపై ఒకటి, విద్యుత్ సమస్యపై మరో దరఖాస్తు అందినట్లు తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేష్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.

అభయహస్తం డబ్బులు చెల్లించాలి: సీపీఎం

నెల్లికుదురు ప్రజావాణి కి 11 దరఖాస్తులు..

గత 15 సంవత్సరాల క్రితం ఒక్కో మహిళ రూ.3,800 చొప్పున చెల్లించిన అభయహస్తం డబ్బులను తిరిగి మహిళలకు చెల్లించాలని కోరుతూ సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు, సీఐటీయూ ఎల్లయ్య ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మహిళలకు చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే తిరిగి అందించాలని వారు కోరారు.

విద్యుత్ సమస్య పరిష్కరించాలి: బీజేపీ

మండల కేంద్రం నెల్లికుదురులో రైతుల సౌకర్యార్థం సింగిల్‌ఫేజ్ విద్యుత్‌ను త్రీ-ఫేజ్‌గా మార్చేందుకు చేపట్టిన పనులు గత కొన్ని సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు చందు రాజకుమార్ తెలిపారు. నిలిచిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించి రైతుల విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన ఆధ్వర్యంలో నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధావత్ సురేష్, ముస్తఫా పాల్గొన్నారు.