భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఐదు దరఖాస్తులు, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. హౌసింగ్ సమస్యపై ఒకటి, విద్యుత్ సమస్యపై మరో దరఖాస్తు అందినట్లు తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేష్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం…