భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

కార్తీక్ అకాల కన్నుమూత బాధాకరం: ఎమ్మెల్యే

కార్తీక్ అకాల కన్నుమూత బాధాకరం:ఎమ్మెల్యే

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన మద్దెల కార్తీక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ శ్రీరామగిరి గ్రామానికి చేరుకొని కార్తీక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్తీక్ అకాల కన్నుమూత తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కుటుంబాన్ని చూసుకోవాల్సిన కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ మాదరి ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ రామగిరి సుమన్, నాయకులు ప్రభాకర్ గౌడ్, బాలాజీ నాయక్, బెల్లి నర్సయ్య, డోనికెన మల్లయ్య, కుటుంబ సభ్యులు సుచరిత, మద్దెల భద్రయ్య, డా. ప్రభాకర్, మద్దెల పవన్ తదితరులు పాల్గొన్నారు.