భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

రైతుల సమస్యపై ఎమ్మెల్యే చొరవ..పట్టాల కోసం కలెక్టర్‌కు వినతి

గన్యా తండా 204 భూముల పట్టాల  పరిష్కారం కోసం కలెక్టర్‌ను కలిసిన గ్రామ ప్రజలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గన్యా తండా గ్రామపంచాయతీకి సంబంధించిన 204 భూముల పట్టాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.

204 భూములకు పట్టాలు మంజూరు చేసి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు కలెక్టర్‌ను కోరారు. ఈ భూములకు పట్టాలు లభిస్తే రైతులు తమ పంటలను స్వయంగా విక్రయించుకోవడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, యూరియా, ఇతర ప్రభుత్వ వ్యవసాయ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని రైతులు తెలిపారు.

గ్రామ ప్రజలు వివరించిన సమస్యను కలెక్టర్ సానుకూలంగా విని, 204 భూముల పట్టాల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

204 భూముల పట్టాల సమస్య పరిష్కారం కోసం చేపడుతున్న ఈ ప్రయత్నం త్వరలో ఫలించాలని గన్యా తండా గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.