భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు

ఇనుగుర్తి లో ఘనంగా స్వర్ణోత్సవ వేడుక.  అంబేద్కర్ యువజన సంఘం పతాకావిష్కరణ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన స్వర్ణోత్సవ పిలుపు మేరకు మండల కేంద్రం ఇనుగుర్తిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఇనుగుర్తి లో ఘనంగా స్వర్ణోత్సవ వేడుక.  అంబేద్కర్ యువజన సంఘం పతాకావిష్కరణ

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ యువజన సంఘం సుదీర్ఘ పోరాట చరిత్ర, ఔన్నత్యాన్ని వివరించారు. స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘంగా రూపాంతరం చెంది, ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి, దిశ కమిటీ సభ్యుడు బాబురావు, సంఘం ప్రధాన కార్యదర్శి బేతమల్ల మనోజ్, దార్ల రామ్మూర్తి, పప్పుల వెంకన్న (108), పింగిళి శ్రీనివాస్, గండు నాగన్న, బేతమల్ల చంద్రయ్య, మహేందర్ రెడ్డి, పప్పుల వెంకన్న (టీచర్), కావటి నర్సయ్య, బూర రజనీకాంత్, గుజ్జునూరి శ్రీకాంత్, దేవులపల్లి వెంకన్న, డీలర్ రాజు, జంపయ్యతో పాటు స్థానిక నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.