భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన స్వర్ణోత్సవ పిలుపు మేరకు మండల కేంద్రం ఇనుగుర్తిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంఘం…






