భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

చిన్ననాగారంలో ఘనంగా అన్నప్రసాద వితరణలు

గణపతు వద్ద కొనసాగుతున్న అన్నప్రసాద వితరణలు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని గణపతి మండపాల వద్ద అన్నప్రసాద వితరణలు కొనసాగుతున్నాయి. మండలంలోని చిన్ననాగారం గ్రామంలో పలు విఘ్నేశ్వర స్వామి మండపాల వద్ద సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.

శ్రీనివాసరావు ఇంటి గణపతి వద్ద

గ్రామంలోని ఎర్రబెల్లి శ్రీనివాసరావు ఇంటి వద్ద యువకులు ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపం వద్ద బొమ్మెర సారమ్మ కుమారుడు సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

శివశక్తి యూత్ వినాయకుడి వద్ద

శివశక్తి గణపతి ఆలయం వద్ద జర్నలిస్ట్ పెదగోని రాజు, రజిత దంపతుల ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది భక్తులు పాల్గొని స్వామివారి మహాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

గణపతు వద్ద కొనసాగుతున్న అన్నప్రసాద వితరణలు..

అంబేద్కర్ కమిటీ లంబోదరుడి వద్ద

ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

1వ వార్డు బొజ్జ గణపయ్య వద్ద

1వ వార్డులోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద గ్రామానికి చెందిన పెదగోని (పల్లె) వెంకటమ్మ, ఆమె కుమారుడు శరత్ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్యతో పాటు వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.