భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని గణపతి మండపాల వద్ద అన్నప్రసాద వితరణలు కొనసాగుతున్నాయి. మండలంలోని చిన్ననాగారం గ్రామంలో పలు విఘ్నేశ్వర స్వామి మండపాల వద్ద సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.
శ్రీనివాసరావు ఇంటి గణపతి వద్ద
గ్రామంలోని ఎర్రబెల్లి శ్రీనివాసరావు ఇంటి వద్ద యువకులు ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపం వద్ద బొమ్మెర సారమ్మ కుమారుడు సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో మహాన్న…






