భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఆయుష్ ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ

ఆయుష్ ఆధ్వర్యంలో మెడిసిన్ పంపిణీ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో ఆయుష్ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ఆయుర్వేద మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత వైద్యశాల వైద్యులు డా. సుజాత ఆధ్వర్యంలో పలు రుగ్మతలతో బాధపడుతున్న గ్రామస్తులకు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ రాయిలి భవాని శేఖర్ హాజరై మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యం పురాతనమైనదైనప్పటికీ, ఆయుర్వేద మందులతో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పలు అనారోగ్య సమస్యలకు చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ శాఖకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లం ఐలయ్యతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.