భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో ఆయుష్ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ఆయుర్వేద మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత వైద్యశాల వైద్యులు డా. సుజాత ఆధ్వర్యంలో పలు రుగ్మతలతో బాధపడుతున్న గ్రామస్తులకు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ రాయిలి భవాని శేఖర్ హాజరై మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యం పురాతనమైనదైనప్పటికీ, ఆయుర్వేద మందులతో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పలు అనారోగ్య సమస్యలకు చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో…






