భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామంలో స్టూడెంట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి ఆలయం వద్ద ‘ఇరుముడి’ సినిమా 4కె లేజర్ సినిమా టిక్ వెర్షన్‌ను ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శనకు భక్తులు, ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై వీక్షించారు.
అయ్యప్ప మాలధారణ పవిత్రత, తండ్రి–కూతుళ్ల మధ్య ఉండే వాత్సల్యం, అమ్మాయిల పట్ల ఆకతాయిల వ్యవహారశైలిపై సినిమా అందించిన సందేశం భక్త ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసింది. భక్తి, కుటుంబ అనుబంధాలు, సామాజిక అంశాలను ప్రతిబింబించేలా సినిమా సందేశం ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహ బహుకరణ దాత పోలోజు హయగ్రీవ చారి, భాగ్యలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. స్టూడెంట్ యూత్ ప్రతినిధులు భైరు వినయ్ గౌడ్, మోటపోతుల అభి, బైరు రంజిత్ గౌడ్, మద్దెల బన్నీ గౌడ్, బండారి సాయి గౌడ్, బింగి సిద్ధార్థ గౌడ్, కనుకంటి వంశీ, ఆలకుంట్ల సంతోష్ తదితరులు భక్తులు, ప్రేక్షకులకు సినిమా ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.