భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఆన్‌లైన్ చెల్లింపుల పేరుతో మోసపోవద్దు: కమిషనర్

త్రెడ్ లైసెన్స్ ఇంటి పన్నులు డబల్ బెడ్ రూమ్ పట్టా సర్టిఫికెట్ల జారీ విషయమై ఫోన్ చేస్తే నమ్మవద్దు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ట్రేడ్ లైసెన్స్, ఇంటి పన్నులు, డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు పట్టా సర్టిఫికెట్ల జారీకి సంబంధించి కొందరు వ్యక్తులు ప్రజలకు ఫోన్ చేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నర్సాపూర్ పురపాలక సంఘం కమిషనర్ సాయికుమార్ తెలిపారు.

మున్సిపల్ కార్యాలయం నుంచి ఫోన్లు చేయడం లేదు

ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలంటూ నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయం నుంచి ప్రజలకు ఎలాంటి ఫోన్ కాల్స్ చేయడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ విధంగా ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని కోరుతున్న వారి మాటలను నమ్మవద్దని సూచించారు.

డబ్బులు చెల్లించవద్దు

ఎవరైనా ఫోన్ చేసి ట్రేడ్ లైసెన్స్, ఇంటి పన్నులు, డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా పట్టా సర్టిఫికెట్ల పేరుతో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించవద్దని కమిషనర్ సాయికుమార్ సూచించారు.

అలాంటి ఫోన్ కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత వివరాల కోసం నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కోరారు.