భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్వచ్ఛతపై మండల కేంద్రం ఇనుగుర్తిలోని బాలికల గురుకుల విద్యాలయంలో విద్యార్థినులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించవచ్చని అన్నారు.
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
జిల్లా పంచాయతీ అధికారి రేవంత్, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ.. చెత్త ఉత్పత్తి అయ్యే చోటే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచేలా భారత ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చెత్తను బాధ్యతగా నిర్వహించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన
ఈ సందర్భంగా విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. చెత్తను విచ్చలవిడిగా వేయకుండా, తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సరైన విధంగా నిర్వహించడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారధి, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.