భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

చిన్నముప్పారంలో ఘనంగా పోషణ మాసోత్సవం

చిన్నముప్పారంలో ఘనంగా పోషణ మాసోత్సవం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్నముప్పారంలో ఐసిడిఎస్ అంగన్‌వాడీ సెక్టార్ ఆధ్వర్యంలో మంగళవారం పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ రాయలి భవాని శేఖర్, ఏసీడీపీవో కమలాదేవి, సూపర్‌వైజర్ సంధ్యారాణి హాజరయ్యారు.

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ఈ సందర్భంగా సర్పంచ్ భవాని శేఖర్ మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో పోషణ

ఏసీడీపీవో కమలాదేవి మాట్లాడుతూ కాలానుగుణంగా లభించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలను ఆహారంలో సమృద్ధిగా వినియోగించాలని వివరించారు. ఐరన్, విటమిన్-ఏ, విటమిన్-బి ప్రాముఖ్యతపై గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లం ఐలయ్య, అంగన్‌వాడీ టీచర్లు స్వరూపరాణి, లలిత, అనిత, సుకన్య, జ్యోతి, అరుణ, ఆయా సత్తెమ్మతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.