భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్నముప్పారంలో ఐసిడిఎస్ అంగన్‌వాడీ సెక్టార్ ఆధ్వర్యంలో మంగళవారం పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ రాయలి భవాని శేఖర్, ఏసీడీపీవో కమలాదేవి, సూపర్‌వైజర్ సంధ్యారాణి హాజరయ్యారు.

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ఈ సందర్భంగా సర్పంచ్ భవాని శేఖర్ మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కూరగాయలు, పండ్లు,…