భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా జీపీ పరిధి మర్రికుంట తండాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ చేపట్టారు.
సుమారు 500 మందికి అన్నప్రసాదం
ఈ సందర్భంగా తండావాసులతో పాటు పరిసర తండాల నుంచి వచ్చిన ప్రజలకు సుమారు 500 మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు డిమార్ట్ రాజు తదితరులు మాట్లాడుతూ శ్రీ మహాగణపతి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు, తండావాసుల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ భూక్య రాములు, సేవాలాల్ యూత్ ప్రతినిధులు భూక్య ప్రభాకర్, భూక్య శ్రీను, భూక్య రాజు, భూక్య సైదులు, భూక్య మహేందర్, భూక్య నితిన్, భూక్య జగన్, భూక్య రమేష్, గుగులోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
చిన్ననాగారంలోనూ అన్నప్రసాద వితరణ
ఇదిలా ఉండగా, మండలంలోని చిన్ననాగారంలో గడివాడ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మండపం వద్ద స్వర్గీయ పోలోజు శ్రావణ్ పేరున మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్ఐ పి. నరేష్ ప్రారంభం
ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ పి. నరేష్ ప్రారంభించారు. అనంతరం భక్తులకు మహాన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత యాకయ్య, గడివాడ యూత్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.