భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ఏ రాశికి శుభవార్తలు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

ఏ రాశికి శుభవార్తలు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

భారత్ సమాచార్, హైదరాబాద్:

మేషం

దైవదర్శనాలు చేసుకుంటారు. వృథా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.

వృషభం

సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం

ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధనపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. దైవచింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమపడినా ఆశించిన ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం

ఉద్యోగాల్లో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

సింహం

పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్వాములతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరుత్సాహం ఎదురవుతుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు.

కన్య

ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువుల లాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

తుల

విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు.

వృశ్చికం

స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్ప ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి.

ధనుస్సు

సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.

మకరం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.

కుంభం

కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. సంతానం విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీనం

ఉద్యోగాల్లో అధికారులతో కొద్దిపాటి వివాదాలు ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది.