భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

నిమజ్జనాలు సాయంత్రం 5 గంటల్లోగా ముగించాలి

నిమజ్జనాలు సాయంత్రం 5 గంటల్లోగా ముగించాలి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గణపతి నిమజ్జన ఉత్సవాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా ముగించాలని ఎస్సై పి. నరేష్ ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, వినాయక ఉత్సవ కమిటీల బాధ్యులకు సూచించారు.

ప్రశాంతంగా నిమజ్జనాలు నిర్వహించాలి

మండల కేంద్రంలో ఈ మేరకు వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, వినాయక ఉత్సవ కమిటీల బాధ్యులతో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినాయక నిమజ్జనాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

అధికారుల సూచనలు పాటించాలి

నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా సంబంధిత అధికారులు సూచించిన సమయాలను పాటిస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించారు.

కార్యక్రమంలో ఎంపీడీవో బండారి పార్థసారథి, వివిధ గ్రామాల సర్పంచులు, ఆయా పార్టీల నాయకులు, వినాయక ఉత్సవ కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.