భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

లడ్డూ కోసం పోటాపోటీ.. రూ.18,116కు దక్కించుకున్న వంశీ

లడ్డూ కోసం పోటాపోటీ.. రూ.18,116కు దక్కించుకున్న వంశీ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామం హనుమాన్ ఆలయం గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంపాట ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు గణపతి లడ్డూను హైదరాబాద్‌కు చెందిన వంశీ యాదవ్ రూ.18,116కు దక్కించుకున్నారు. దీంతో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఉత్కంఠగా సాగిన వేలంపాట

శ్రీ విఘ్నేశ్వర స్వామి లడ్డూ కోసం బెల్లి వంశీ యాదవ్, ఆర్యవైశ్య సంఘం నేత మాలె రమేష్ మధ్య వేలంపాట పోటీ నెలకొంది. చివరి వరకు ఇద్దరూ పోటాపోటీగా వేలం పాడటంతో ఉత్సవ ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

చివరికి భాగ్యనగరానికి చెందిన వంశీ యాదవ్ రూ.18,116కు లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంపాట ముగిసిన అనంతరం గణపతి ఉత్సవ నిర్వాహకులు వంశీ యాదవ్ తరఫున ఉడుత పద్మకు గణపతి నామస్మరణల మధ్య లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా ఉడుత పద్మను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

లడ్డూ కోసం పోటాపోటీ.. రూ.18,116కు దక్కించుకున్న వంశీ

విగ్రహ దాత మాలె రమేష్‌కు ఘన సన్మానం

లడ్డూ వేలంపాటలో చివరి వరకు పాల్గొని పోటీ చేసిన వినాయక విగ్రహ దాత మాలె రమేష్‌ను కూడా గణపతి ఉత్సవ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. దైవిక కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తూ తన వంతు సహకారం అందిస్తున్న రమేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

గత సంవత్సరంలోనూ హనుమాన్ గణపతి లడ్డూ వేలంపాటలో మాలె రమేష్ చివరి వరకు పోటీపడి లడ్డూను దక్కించుకున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది కూడా వేలంపాటలో చివరి వరకు పాల్గొని ఉత్సవాలను మరింత ఉత్సాహంగా మార్చారని పేర్కొన్నారు.

హైదరాబాద్ వాసి లడ్డూ దక్కించుకోవడంతో హర్షం

చిన్ననాగారం హనుమాన్ ఆలయం గణపతి ఉత్సవాల్లో నిర్వహించిన లడ్డూ వేలంపాటలో హైదరాబాద్ వాసి వంశీ యాదవ్ రూ.18,116కు లడ్డూను కైవసం చేసుకోవడం పట్ల గణపతి ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు.