భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలో శుక్రవారం విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నమామి భారతం సామూహిక సంపూర్ణ వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శ్రీ సరస్వతి విద్యా పీఠం ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి దామోదర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సుభద్ర వాటిక శిశు మందిరంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం స్ఫూర్తి
అనంతరం దామోదర్ మాట్లాడుతూ.. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో, స్వాతంత్ర్యాన్ని సాధించాలనే స్ఫూర్తిని నింపడంలో వందేమాతరం గీతం ఎంతో ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.
ఉదయం 10 గంటలకు సామూహిక గీతాలాపన
శుక్రవారం ఉదయం 10 గంటలకు భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భైంసాలోని సరస్వతి శిశు మందిరాల విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు, మహిళలు, పెద్దలు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పలువురు ప్రముఖుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్ర నిలయం పాఠశాల అధ్యక్షులు కొండ గంగాధర్ గౌడ్, పాఠశాల సహాయ కార్యదర్శి చందులాల్, పాఠశాల కోశాధికారి కట్కం సాయినాథ్, పాఠశాల సమితి సభ్యులు ఎర్రవార్ బాలాజీ, క్షేత్ర సంగీత ప్రముఖ్ మెట్టోల్ల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.