భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

యాదగిరిగుట్టలో ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం

ఈనెల 27న యాదగిరిగుట్టలో ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ఈనెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఉద్యమకారుల ఫోరం తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, గౌరవాధ్యక్షుడు కళ్లెం లక్ష్మారెడ్డి, జిల్లా గౌరవ సలహాదారు బొడిగె సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు.

గోడపత్రికల ఆవిష్కరణ

గురువారం ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఆకాంక్షల సాధన కోసం గత తొమ్మిదేళ్లుగా డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం

ఉద్యమకారుల హక్కులను మేనిఫెస్టోలో చేర్చించడంలో ఉద్యమకారుల పోరాటం కీలక పాత్ర పోషించిందని వారు పేర్కొన్నారు. ఉద్యమకారుల సమస్యలు, ఆకాంక్షల సాధన కోసం ఫోరం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

భారీగా తరలిరావాలని పిలుపు

ఈనెల 27న యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్, జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణంలో తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పలువురి పాల్గొనడం

ఈ కార్యక్రమంలో చిలుగూరి సత్తిరెడ్డి, కదిరేణి స్వామి, ఐటీ పాముల పుష్పమ్మ, కన్నెకంటి శ్రీనివాసచారి, కొండూరు శ్రీరాములు, సత్తయ్య, పల్లెర్ల రామచంద్రం, దండ మల్లికార్జున్, ఉక్కుర్తి స్వామి, పారుపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.