భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

చిన్న ముప్పారంలో వైభవంగా వినాయక నిమజ్జనం

చిన్న ముప్పారంలో వైభవంగా వినాయక నిమజ్జనం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదవ సెంటర్ వద్ద గ్రామస్తులచే విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వర స్వామిని అందంగా అలంకరించి నిమజ్జనానికి తరలించారు.

భక్తి పాటలు, సంకీర్తనలతో ఆధ్యాత్మిక సందడి

గ్రామంలోని భగవత్ భక్తులైన మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, సంకీర్తనలు, భక్తి పాటలు ఆలపించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు విఘ్నేశ్వరుని నామస్మరణ చేస్తూ ‘గణపతి బప్పా మోరియా’ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేయడంతో గ్రామం మార్మోగింది.

చిన్న ముప్పారంలో వైభవంగా వినాయక నిమజ్జనం

గంగమ్మ ఒడికి గణనాథుడు

అనంతరం విఘ్నేశ్వర స్వామిని శోభాయాత్రగా చెరువు వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు ‘బై బై గణపయ్య’ అంటూ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. అనంతరం స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చారు.

ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక యూత్ సభ్యులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.